ఫ్యూచర్ సిటీతో ఈ ప్రాంతంలో రియల్ బూమ్ ఖాయం. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం మరో కూకట్పల్లి కానుంది..
Hyderabad: ఒకప్పుడు కూకట్పల్లి నగర శివారుల్లో ఉండేది. కానీ ప్రస్తుతం కూకట్పల్లి మిడిల్ ఆఫ్ ది సిటీగా మారింది. అయితే రానున్న రోజుల్లో హైదరాబాద్‌లోని మరో ప్రాంతం కూడా ఇలాగే అభివృద్ధి చెందనుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.
రియల్ ఎస్టేట్ హబ్‌గా శ్రీశైలం హైవే
wa.me/918099466994
ఒకప్పుడు ఖాళీ ప్లాట్లతో మాత్రమే కనిపించిన శ్రీశైలం హైవే పరిసరాలు ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అపార్ట్మెంట్లు, విల్లాలు, ఇండిపెండెంట్ ఇళ్లు భారీగా నిర్మాణంలోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి.
ఫ్యూచర్ సిటీ ప్రభావం:
శ్రీశైలం హైవే సమీపంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి కొత్త ఊపిరి పోసింది. ఇప్పటికే ఒక వైపు హార్డ్‌వేర్ పార్క్, మరోవైపు ఫ్యాబ్ సిటీ, సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం వల్ల ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం వచ్చింది. ఫ్యూచర్ సిటీ పూర్తయిన తర్వాత పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు, వ్యాపార కార్యకలాపాలు పెరగనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఈ ప్రాంతంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.
:
కొంగరాకలాన్ నుంచి అమంగల్ వరకు 41.5 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ నిర్మాణం జరుగుతోంది. ఇది ఔటర్ రింగ్ రోడ్ (ORR) ను రీజినల్ రింగ్ రోడ్ (RRR) తో కలుపుతుంది. ఈ ప్రాజెక్టును హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. అమంగల్ నుంచి ప్రతిపాదిత శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ వరకు నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి ప్రతిపాదనలు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే తయారు చేసింది. ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు నిరంతర ఫోర్ లేన్ ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ వైపు ప్రయాణ దూరం తగ్గి సమయం ఆదా అవుతుంది.
గృహ నిర్మాణాలు పెరుగుతున్నాయి





Post a Comment for "ఫ్యూచర్ సిటీతో ఈ ప్రాంతంలో రియల్ బూమ్ ఖాయం. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం మరో కూకట్పల్లి కానుంది.. "